MBNR – ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి – సంరక్షించండి…..

@ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి – సంరక్షించండి
@మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువు ను అందిస్తాయి -జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో,జిల్లాలో అడవుల శాతం పెరిగిందని, చెట్ల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవాళికి ఎన్నో లాభాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.
ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు పోసే కార్యక్రమం లో భాగంగా ఈ శుక్రవారం ఆయన వినూత్నంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఒక పెద్ద వృక్షానికి చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ తీసుకొని మనం జీవించేందుకు అవసరమయ్యే ప్రాణ వాయువునిస్తున్నాయని పేర్కొంటూ మొక్కల ప్రాధాన్యత తెలిసే విధంగా రూపొందించిన సైన్ బోర్డు ను ఏర్పాటు చేయించారు.
మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని స్వచ్ఛమైన ఆక్సీజన్ ఇస్తాయని,చెట్ల వల్ల వర్షం తో పాటు, కలప ,ఇతర అనేక లాభాలున్నాయని , అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా, వాటికి క్రమం తప్పకుండా నీరు పోయాలని చెప్పారు. ముఖ్యంగా వేసవికాలంలో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు వారంలో మూడు, నాలుగు రోజులు నీరు పోయాలని అన్నారు.
రానున్న వర్షాకాలంలో జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని నర్సరీలలో పెంచే మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలని ,ఎక్కడైనా బ్యాగులలో విత్తనాలు మొలకెత్తనట్లైతే కొత్త విత్తనాలు వేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి ఒక్కరు మొక్కల ప్రాధాన్యత తెలుసుకొని విరివిగా మొక్కలు నాటాలని,సంరక్షించాలని కోరారు.

 

 

Share This Post