MBNR – ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ను ఖచ్చితంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు.

గురువారం అమిస్తాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీలో భాగంగా వాక్సినేషన్ వేయించుకునే వారి దగ్గరుండి వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు విధిగా వాక్సినేషన్ తప్పక వేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని. జిల్లాలో నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని, అందుకు వైద్య శాఖ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ, తదితరులు ఉన్నారు.

Share This Post