MBNR – ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతంలో ప్రతి ఇల్లు సందర్శించాలి – స్థానిక సంస్థల ఆధనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

@ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతంలో ప్రతి ఇల్లు సందర్శించాలి
@ సీజనల్ వ్యాధులపై రూపొందించిన కరపత్రాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలి- స్థానిక సంస్థల ఆధనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
వర్షాల అనంతరం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
బుధవారం ఆయన జిల్లాలోని మహబూబ్ నగర్ ,భూత్పూర్, జడ్చర్ల మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఇంజనీర్లు ,శానిటేషన్ అధికారులు, సిబ్బందితో సీజనల్ వ్యాధులు, పారిశుధ్య నిర్వహణపై మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో సమావేశం నిర్వజించారు.అంతేకాక ఆన్లైన్ సమావేశాన్ని కూడా నిర్వహించారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు కరపత్రాలను ముద్రించడం జరిగిందని, ఇవన్నీ ప్రజలందరూ చూసేలా వాట్సప్ గ్రూపులలో పంపించాలని ,అదేవిధంగా వార్డు అధికారులు పట్టణ ప్రాంతాలలోని ప్రతి ఇంటిని సందర్శించాలని ఆదేశించారు.పారిశుధ్య నిర్వహణపై ఇల్లు ఇల్లు తిరిగి డ్రైడే నిర్వహించడం, వ్యాధుల పట్ల అప్రమత్తం చేయాలన్నారు. ప్రతివార్డులో ఫ్లెక్సీలు,కరపత్రాలు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ తాగు నీటికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, హరితహారం కింద ఇంటి పెరట్లో పెంచుకునేందుకు ఇచ్చే మొక్కలను తక్షణమే అన్ని మున్సిపాలిటీలలో పంపిణీ చేయాలని, అదేవిధంగా పార్కుల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు.
మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్ కుమార్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్, జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ ,బూథ్ పూర్ మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్, మున్సిపల్ మేనేజర్ జి. వెంకటేశ్వర రావు, మహబూబ్ నగర్ మున్సిపల్ ఇంజనీర్లు సుబ్రమణ్యం, డిప్యూటీ ఇంజనీర్ బెంజిమెన్ ,టౌన్ ప్లానింగ్ ఏసిపి ప్రతాప్ ,టిపిఓ శ్రీకాంత్, ఏఓ శిరీష, ఏఈలు పృథ్వి ,సాయిరాం, హరికృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ వాణికుమారి, రవీందర్ రెడ్డి, గురులింగం, పబ్లిక్ హెల్త్ ఈ ఈ విజయ భాస్కర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

 

Share This Post