MBNR – ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నాడు వారికి (24) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

                ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నాడు వారికి (24) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
                 సోమవారం హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామంలో ఆదివాసీల కోసం 120.96 లక్షల వ్యయంతో నిర్మించనున్న 24 డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన మరియు భూమి పూజ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీల దినోత్సవం రోజున చెంచులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని, ఆదివాసీలు అడవుల్లోనే ఉంటారని, వారు అడవిని వదిలి వెళ్లలేరని అందువల్ల అడవి లాంటి ప్రాంతంలోనే వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందని, ఇంతకుముందు వారు జనాళ్ళలో కలిసే వారు కాదని, కానీ ఇప్పుడిప్పుడే వారు జనాళ్ళలో తిరుగుతున్నారని, అలానే వారికి కళ్యాణ లక్ష్మీ, పింఛన్, రేషన్ బియ్యం వంటి ఎన్నో పథకాలు అందుకుంటున్నారని, త్వరలో మరిన్ని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందిస్తామని, ఇక్కడే పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని దానిలో కూరగాయలు, పండ్లు వంటివి సాగు చేసుకోవచ్చని వారికి హామీ ఇచ్చారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద పని చేసుకోవాలి అనుకునే వారికి వంద శాతం సబ్సిడీ రుణాలు అందినే దిశగా కృషిచేస్తామని మంత్రి అన్నారు. వ్యవసాయానికి ఎండ కాలంలో కూడా నీళ్ల కొరత లేకుండా ఉండటం కొరకు త్వరలో జిల్లాలోని ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చేలా ఒక ప్రాజెక్ట్ తీసుకువస్తున్నామని, ఎవరైనా చెంచుల జోలికి వస్తే ఊరుకునేది లేదని మంత్రి అన్నారు. ఆదివాసీలు (చెంచులు) తో కలిసి మంత్రి భోజనం చేశారు.
                   అనంతరం హన్వాడ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ 24వ విడత లో భాగంగా 86 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు.
                   అడిషనల్ కలెక్టర్ సీతారామ రావు, గృహ నిర్మాణ సంస్థ అధికారి, తహసీల్దార్ బక్క శ్రీనివాస్, సర్పంచ్ సుధ అనంత రెడ్డి, జెడ్.పి.పి ఇతరులు పాల్గొన్నారు.

Share This Post