MBNR – ఫైళ్లు, ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ లను 100% డిజిటలైజేషన్ చేసినందుకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును అందుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

@ ఫైళ్లు, ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ లను 100% డిజిటలైజేషన్ చేసినందుకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును అందుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
@జిల్లాకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు రావడం చాలా సంతోషం -జిల్లా కలెక్టర్ @మహబూబ్ నగర్ జిల్లా మరోసారి దేశ స్థాయిలో తన ఖ్యాతిని చాటింది
మహబూబ్ నగర్ జిల్లా పేరు ఇటీవల వరుసగా జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో వినపడుతోంది. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడమే కాకుండా స్కాచ్ అవార్డులను జిల్లా సాధించిన విషయం విదితమే. ఇదే పరంపరను కొనసాగిస్తూ అన్ని అంశాలలో జిల్లా ముందుంటున్నది.ముఖ్యంగా ఈ -ఆఫీస్ నిర్వహణలో మహబూబ్ నగర్ జిల్లా నూటికి నూరు శాతం అమలు చేసి ఇదివరకే స్కాచ్ అవార్డును సాధించింది. ఇప్పుడు కొత్తగా రికార్డు రూమును నూటికి నూరు శాతం డిజిటలైజేషన్ చేయడమే కాకుండా పది వేలమంది ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి పోర్టల్ లో ఉంచింది. ఇందుకుగాను గవర్నెన్స్ నౌ అనే జాతీయ సంస్థ జిల్లాకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును ప్రకటించింది.
గురువారం న్యూ ఢిల్లీ నుండి గవర్నెన్స్ నౌ సంస్థ ఎం డి కైలాష్ నాథ్ అధికారి ఈ అవార్డును వర్చువల్ విధానం ద్వారా జిల్లా కలెక్టర్ఎస్. వెంకట రావు కు అందజేశారు.
ఇందుకుగాను జిల్లా కలెక్టర్ ను రెవెన్యూ అధికారులు , జిల్లా అధికారులు అభినందించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 67158 ఫైళ్లు,50 లక్షల పేజీలు,10 వేల మంది ఉద్యోగుల స్సర్వీస్ రిజిస్టర్లను భద్రంగా డిజిటల్ చేయడం గర్వాంగా ఉందని,ఇందుకు జాతీయ స్థాయిలో అవార్డ్ రావటం సంతోసమని ఆన్నారు . ముఖ్యంగా 140 సంవత్సరాల కు సంబంధించిన ఉర్దూ, పార్సిలో ఉన్న భూమి రికార్డులు డిజిటలైజ్ చేశామని తెలిపారు. ఫైళ్ల డిజిటలైజేషన్ కాకుండా వాటిని ఒక్క బటన్ తో వెతుక్కోవడాం లేదా ఇతరులకు పంపించే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. అంతేకాక సంవత్సరం, శాఖ, విభాగం వారి గా వాటిని వెతుక్కోవచని తెలిపారు. ఇందుకు సహకరించిన రెవిన్యూఉద్యోగులు, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి ,ఇతర ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
జిల్లా కు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలియజేస్తూ అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, కె.సీతారామారావు , శాలువా,పూల మొక్కలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి సత్యనారాయణమూర్తి డి పి ఆర్ ఓ యు. వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ ,ఏవో ప్రేమ్ రాజ్, కలెక్టర్ కార్యాలయంలోని విభాగాల అధిపతులు తదితరులు హాజరయ్యారు పాల్గొన్నారు.

 

Share This Post