MBNR – బస్థి దవఖానాలో రేపటినుండే రక్త నమూనా పరీక్షలు – మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

@ మున్సిపాలిటీ పరిధిలోని వీరన్న పేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం
@వీరన్నపేట బస్థి దవఖానాలో రేపటినుండే రక్త నమూనా పరీక్షలు-మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
ఒకప్పుడు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వీరన్నపేట ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .
శుక్రవారం ఆయన వీరన్నపేట అంబ భవాని దేవాలయం సమీపంలో 35 లక్షల రూపాయల వ్యయంతో ఆధునికరించనున్న మురికి కాలువ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ వీరన్న పేటలో గతంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, ప్రజలు ఇరుకైన రహదారులతో, మురికి కాలువలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 2014 తర్వాతనే వీరన్నపేట పాఠశాల అభివృద్ధి చేశామని, 15 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టామని,ప్రస్తుతం పై ఫ్లోర్ నిర్మాణాన్ని చేపట్టనున్నామని తెలిపారు. తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించామని, అంతేకాక వీరన్న పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడమే కాకుండా, గురుకుల పాఠశాలను తీసుకువచ్చామని, మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వార్డులోని శివాలయం కోసం నిధులు ఇచ్చామని ,అంతేకాక ముస్లిం గ్రేవీ యార్డ్ కూడా నిధులు ఇచ్చామని ,త్వరలోనే హిందూ స్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. 300 మంది వీరన్నపేట వాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చామని, ఇంకా ఎవరికైనా ఇల్లు రాని వారికి స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు .
వీరన్న పేటలో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్థి దవాఖాన తో పాటు, దూద్ దవాఖానలను ఏర్పాటు చేశామని,బస్తి దవాఖానలో రేపటినుండే రక్త నమూనాలను సేకరించి 45 రకాల పరీక్షలను పూర్తిస్థాయిలో ఉచితంగా అందిస్తామని, సాయంత్రం లోపు రోగి సెల్ఫోన్ కు టెస్ట్ రిపోర్ట్ ల ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ లో చైర్మన్ కేసి నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ,వార్డ్ కౌన్సిలర్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు ,మున్సిపల్ ఇంజనీర్ సుబ్రమణ్యం తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

 

Share This Post