MBNR – భూసేకరణ పనులను వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు.

@భూసేకరణ పనులను వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు ,రైల్వే ప్రాజెక్టులు, రహదారుల విస్తరణ కింద చేపట్టిన భూసేకరణ పనులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పునరావాస కేంద్రం పనులపై సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఇంజనీరింగ్ అధికారులు మిగిలిపోయిన భూసేకరణ పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. ముఖ్యంగా భూసేకరణకు సంబంధించి డి ఎన్ డి డి వంటివి త్వరితగతిన ప్రచురించి పనులు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టుల కింద ఇంకా భూసేకరణ పెండింగ్లో ఉన్నట్లయితే ఆ పనులు కూడా తాసిల్దారులు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు దగ్గరుండి పూర్తిచేయాలని ,సేకరించిన భూములకు సంబంధించి జెండాలు పాతే ఏర్పాటు చేయాలని చెప్పారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఏర్పాటు చేయనున్న పునరావాస కేంద్రాలలో పనులకు సంబంధించిన టెండర్లను తక్షణమే పిలవాలని ఆదేశించారు. ఆయా ఇంజనీరింగ్ శాఖల వారీగా పునరావాస కేంద్రాలలో చేపట్టాల్సిన పనుల టెండర్ల పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ధరణి పై సమీక్షిస్తూ తహసీల్దార్లు ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ,డి ఆర్ ఓ కే .స్వర్ణలత, మిషన్ భగీరథ ఎస్ .ఈ వెంకటరమణ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎస్ ఈ శ్రీనివాస్, ఆర్అండ్ బి ఇంజనీర్లు, పంచాయతీరాజ్ ,రైల్వే, జాతీయ రహదారుల సంస్థ ఇంజనీర్లు, తదితరులు ,ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు .

Share This Post