MBNR – మన ఊరు -మనబడి కింద చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మన ఊరు -మనబడి కింద చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి మన ఊరు- మనబడి పనులపై ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ,ఈడబ్ల్యు ఐ డి సి, టి ఎస్ ఎం ఐ డి సి ,హౌసింగ్ , ఇరిగేషన్ తదితర ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి 30 లక్షల రూపాయల కన్నా పైన ఉన్న పనులకు తక్షణమే టెండర్లు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అలాగే 30 లక్షల కన్నా ఎక్కువ ఉన్న పనులు, పెండింగ్లో ఉన్న పనుల పై వెంటనే తనకు జాబితా సమర్పించాలని ఆదేశించారు. అలాగే పనులకు సంబంధించి ఎఫ్ టి ఓ జనరేషన్ వేగవంతం చేయాలని, మంగళవారం సాయంత్రం నాటికి ఎఫ్ టి ఓ లన్ని జనరేట్ చేయాలని చెప్పారు. ఎం బుక్ రికార్డ్ చేసిన తర్వాతనే అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పనులు పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులతో పాటు, విద్యాశాఖ ఎంఈఓ లు కూడా దృష్టి సారించాలని చెప్పారు. మన ఊరు- మనబడి పనులపై నిర్లక్ష్యం వస్తే షో కాజ్ నోటీస్ జారీ చేస్తామని ఆయన హెచ్చరించారు .వచ్చే నెల 10 నాటికి మండలాల వారీగా కనీసం రెండు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఆయ ఇంజనీరింగ్ విభాగాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ,ఎంఈఓ లు హాజరయ్యారు .

 

Share This Post