MBNR – మహబూబ్ నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో మిగిలిపోయిన 2 వైన్ షాపులకు మంగళవారం పూర్తి పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు.

మహబూబ్ నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో మిగిలిపోయిన 2 వైన్ షాపులకు మంగళవారం పూర్తి పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు.
ఈనెల 20 న అప్పనపల్లి సమీపంలోని వైట్ కన్వెన్షన్లో మహబూబ్ నగర్ ఎక్సైజ్ పరిధిలోని వైన్ షాపులకు నిర్వహించిన లక్కీ డ్రా సందర్భంగా నారాయణపేట జిల్లా దన్వాడ మండలానికి చెందిన 67, 68 షాపులకు నిర్దేశించిన దరఖాస్తులు రాక పోవడంతో ఆరోజు వాటికి లక్కీ డ్రా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు షాపు లకు మంగళ వారం రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది .
ఈ డ్రా లో షాప్ నెంబర్ 67 కు సంబంధించి మొత్తం 30 దరఖాస్తులు రాగా సీరియల్ నెంబర్ 3 కు సంబంధించిన మురళీధర్ గౌడ్ లక్కీ డ్రా లో షాప్ ను కైవసం చేసుకున్నారు. అదే విధంగా 68 వ షాప్ కు సంబంధించి 27 దరఖాస్తులు రాగా, 10 వ సీరియల్ నెంబర్ వ్యక్తి వై.శ్రీనివాసులు ఈ షాపును దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగిలిపోయిన 2 వైన్ షాపులకు పూర్తి పారదర్శకంగా అధికారులు, దరఖాస్తు దారుల సమక్షంలోనే లక్కీ డ్రా నిర్వహించి వారి ఎదురుగానే లక్కీ డ్రా తీయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషి, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

Share This Post