MBNR – మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సంవత్సరం బ్యాంకుల ద్వారా 5500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

@గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కృషి
@ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సంవత్సరం బ్యాంకుల ద్వారా 5500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధించేందుకు నిరంతరం గ్రామాలలో నిధులుండేలా ముఖ్యమంత్రి వివిధ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలోని బ్యాంకు ఉన్న ప్రతి గ్రామంలో సుమారు 25 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగిందని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు గ్రామాలలోని నిరుపేదలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి లోని నీరు పేదలకు సహకరించాలని కోరారు.
జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆజాదిక అమృత మహోత్సవం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కస్టమర్ అవుట్ రీచ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లాలో గత సంవత్సరం 3651 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వగా, ఈ సంవత్సరం 5500 కోట్ల రూపాయలను రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు.
2014 కు పూర్వం లావాదేవీలు, ఇప్పటి లావాదేవీలను బేరీజు వేసుకోవాలి అని అన్నారు .గతంలో మండలానికి ఒక బ్యాంక్ ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రతి నాలుగు గ్రామాలకు కలిపి ఒక బ్యాంకు ఏర్పాటు అయిందని భవిష్యత్తులో రెండు గ్రామాలకు ఒక బ్యాంకు వస్తుందని దీనిపై ఎలాంటి సందేహం లేదని అన్నారు. రుణాల మంజూరులో దళారుల ప్రమేయం ఉండకూడదని, ఒకవేళ ఎవరైనా దళారీల ప్రమేయం ఉన్నట్లు అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బ్యాంకర్లు వినియోగదారులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తీర్చాలని, అప్పుడే వారు కూడా బ్యాంకులకు సహకరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే రుణాల గురించి ప్రజలకు విసృతంగా తెలియజేయాలని అన్నారు.వినియోగదారులు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు పూర్తి సహకారం అందించాలని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి నాగరాజారావు ,రాష్ట్ర గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు బాలరాజు యాదవ్, మున్సిపల్ చైర్మన్ కె .సి. నరసింహులు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజేష్ ,వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, ఏపీ జి వి ఆర్ ఎం సుభాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

Share This Post