MBNR – మహబూబ్ నగర్ జిల్లాలో విజయవంతంగా ధరణి అమలు – జిల్లాకలెక్టర్ ఎస్.వెంకటరావు.

@ధరణి కి సంవత్సరం పూర్తి
@మహబూబ్ నగర్ జిల్లాలో విజయవంతంగా ధరణి అమలు – జిల్లాకలెక్టర్ ఎస్.వెంకటరావు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మానస పుత్రికైన ధరణి పోర్టల్ ను దేశంలోనే తొలిసారిగా అక్టోబర్ 29 2020న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోంది.
ధరణి పోర్టల్ వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్బంగా శుక్రవారం రెవెన్యూ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేశారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, , వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ అని, భూ సంబంధిత లావాదేవీలకు ధరని పరిష్కారాన్ని అందిస్తుందని అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతోందని,ధరణి ని సమర్థవంతంగా అమలు చేయడంలో పాలుపంచుకుంటున్న అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని అభినందించారు.
ధరణి ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 46 వేల 122 ప్లాట్స్ బుక్ ఆయ్యాయని కలెక్టర్ తెలిపారు. 22546 సేల్ ట్రాన్సాక్షన్స్, 5946 గిఫ్ట్ ట్రాన్సాక్షన్స్, 894 సక్షేషన్లు పూర్తి చేయడం జరిగిందని, 7560 మ్యుటేషన్ లు,7129 భూములు విషయాలపై వచ్చిన ఫిర్యాదులను, 1711 ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి, అలాగే 1762 కోర్టు కేసులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
జిల్లాలో ధరణి పోర్టల్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు తాసిల్దార్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ప్రతిరోజూ 10 నుండి 15 గంటలు కష్టపడి పని చేశారని కలెక్టర్ తెలిపారు .కేవలం 3 మాడ్యూల్స్ తో ప్రారంభమైన ధరనిలో ప్రస్తుతం 21 మాడ్యూల్స్ ఉన్నాయని, ధరణి యాప్ సామాన్య ప్రజలు కూడా ఉపయోగించే విధంగా అందుబాటులో ఉందని, ఎల్ ఆర్ యుపీ విజయవంతమైన తర్వాత ధరణి కూడా విజయవంతంగా పరిష్కరించడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. జిల్లాలో 22546 రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం జరిగిందని, ధరణి వల్ల ప్రభుత్వానికి 40 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించారు.
గత 6 వారాలుగా ధరణి కోసం ప్రత్యేక కీయాస్కు ను ఏర్పాటు చేసి ధరణి పై వచ్చిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని, ధరణి వల్ల రైతులు అధికారులకు ఎంతో మేలు చేకూరుతున్నదని, ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు .ధరణికి రైతుబంధు కు దగ్గర సంబంధం ఉందని, భూమి రికార్డుల నిర్వహణ లో ధరణి విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చిందని కలెక్టర్ వెల్లడించారు . పది, పదిహేను రోజుల్లో మరి కొన్ని యాప్స్ రానున్నాయని, దీంతో మరిన్ని సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. వచ్చేనెల 8 నుండి మండల తాసిల్దార్ కార్యాలయాలలో ధరణి కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, జిల్లాలో ధరణి లో ఇప్పటివరకు 4 తప్పుడు లావాదేవీలు జరగగా పోలీసులు కేసు నమోదు కాగా వారు కూడా వారంతట వారు తిరిగి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చేశామని కలెక్టర్ వెల్లడించారు. ధరణిలో ఆధార్ లింకుతో బయోమెట్రిక్ ఆధారపడి ఉన్నందున ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని, పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా 14 సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పేరు మార్పు, విస్తీర్ణం, వర్గీకరణకు సంబంధించి త్వరలోనే ఆప్ రానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చెన్న కిష్టన్న, రాజగోపాల్, జెఎసి అధ్యక్షులు రాజీవ రెడ్డి మాట్లాడారు.
ఆర్.డి.ఓ పద్మశ్రీ ,డి పి ఆర్ ఓవెంకటేశ్వర్లు, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏ డి శ్రీనివాసులు తదితరులు ఈ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ధరణిపై ప్రత్యేకంగా రూపొందించిన పాటలను వినిపించారు.

Share This Post