MBNR – మహబూబ్ నగర్ జిల్లా ఏకో టూరి జానికి, టెంపుల్ టూరిజానికి ఎంతో ప్రసిద్ధి @ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు.

@దేశంలోనే అతి పెద్దదైన కెసిఆర్ అర్బన్ ఎకో పార్కు మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంది
@మహబూబ్ నగర్ జిల్లా ఏకో టూరి జానికి, టెంపుల్ టూరిజానికి ఎంతో ప్రసిద్ధి @ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్ నగర్ సమీపంలోని కెసిఆర్ అర్బన్ ఎకో పార్కు లో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా పర్యాటక రంగానికి, చారిత్రక స్థలాల కు ఎంతో ప్రాముఖ్యత ఉందని ,ముఖ్యంగా జిల్లాలో దేశంలోనే అతి పెద్దదైన 2087 ఎకరాల విస్తీర్ణం కలిగిన కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పిల్లలమర్రి ,పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ, కురుమూర్తి, కోయిల్ సాగర్,కోయిల్కొండ కోట వంటి ఎన్నో పర్యాటక క్షేత్రాలు, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు.
హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న మయూరి పార్కును చూసేందుకు ప్రతి వారం హైదరాబాద్ నుండి అనేకమంది పర్యాటకులు వస్తున్నారని తెలిపారు .జిల్లాలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఎంతో కృషి చేస్తున్నారని, జిల్లాకు రాష్ట్ర ,దేశ చరిత్రలోనే టూరిజంలో మంచి స్థానం కల్పించేందుకు మంత్రి చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. కెసిఆర్ ఎకో పార్కు లో మినీ జూ ఏర్పాటుకు మంత్రి ఆదేశించినందున ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని డి ఎఫ్ ఓ ను ఆదేశించారు. టూరిజం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని, అందువల్ల జిల్లాలోని టూరిజం ప్రదేశాలను సందర్శించే లాగా ఒక సర్క్యూట్ ను రూపొందించాలని ఇందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి హైదరాబాద్ నుండి బస్సులు వచ్చేలా ఏర్పాటు చేయాలని జిల్లా పర్యటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు ను ఆదేశించారు. దీని వల్ల స్థానికంగా ఉండే వారికి ఉపాధి తో పాటు ఎన్నో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.అలాగే జిల్లాలో ఎకో టూరిజం తో పాటు,టెంపుల్ టూరిజనికై ఆర్ టి సి,దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి ఒక సర్క్యూట్ రూపొందించాలన్నారు.
జిల్లా ఎస్పీ ఆర్ .వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యాటక రంగం ద్వారా ఆర్థికంగా లాభపడుతున్నాయని,మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
స్థానికసంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ కె .సీతారామారావు, డిఎఫ్ ఓ గంగా రెడ్డి మాట్లాడారు .
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల గురించి వివరించారు.
జిల్లా రెవెన్యూ అధికారి కె. స్వర్ణలత, ప్రభుత్వ మెడికిల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్ ,జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి, జిల్లా అధికారులు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు, ఇంగ్లీష్ ,ఉర్దూ విభాగాలలో పాఠశాల ,కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో వ్యాసరచన ,వక్తృత్వ ,చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్,ఎస్ పి బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా శిశు వికాస్ గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా పర్యాటకం పై ప్రత్యేకంగా రూపొందించి పాడిన పాటలు అందరిని అలరించాయి.

Share This Post