MBNR – మహబూబ్ నగర్ జిల్లా ను ఎక్స్పోర్ట్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా ను ఎక్స్పోర్ట్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.
ఆజాదికా అమృత్ మహోత్సవాలలో భాగంగా గురువారం రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన ఉత్పత్తులు ఇదివరకే విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, అయితే వాటికి సంబంధించి ఉత్పత్తుల నాణ్యత తో పాటు, సరఫరా బంధాన్ని సక్రమంగా నిర్వహించాలని చెప్పారు . జిల్లాలో 1230 మంది పారిశ్రామికవేత్తలు ఉండగా, 23 రకాల ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. వీటిలో ఆహార ఉత్పత్తులకు సంబంధించిన మామిడి ,మిల్లెట్స్, న్యూట్రిషన్ కు సంబంధించిన ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, ఈ ఉత్పత్తులకు సంబంధించి నాణ్యతతో పాటు, ప్యాకింగ్ తయారీలో మెలకువలను పాటిస్తూ గ్లోబల్ మార్కెట్ కు తీసుకు వెళ్ళాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో ఫెడరేషన్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ,ఆపేడ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉత్పత్తులు వినియోగదారుడికి చేరే వరకు సరఫరా చైన్ సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ,ఆపేడఆర్గనైజేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో ఇదివరకే ఎగుమతి అవుతున్న ఉత్పత్తులకు సంబంధించిన పొటెన్షియాలిటీ, ఎగుమతులకు అవసరమైన నాణ్యత ప్రమాణాలపై సమావేశానికి హాజరైన వారికి వివరించారు.
ఎస్ బి ఐ ఏ జి ఎం శ్రవణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తమకు 53 ఉండగా, ఒక శాఖ ప్రత్యేకించి ఎక్స్పోర్టు,ఇంపోర్ట్ కు సంబంధించిన అంశాలపై పని చేస్తున్నట్లు వివరించారు.
అంతకుముందు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి సమావేశ వివరాలను తెలియజేశారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ జె డి పి టి శ్రీనివాస్,ఆపేడ ఏజీఎం నాగపాల్ , ఎం ఎస్ యం ఈ సి ఎస్ సుదర్శన్, డిఆర్డిఓ యాదయ్య, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇతర సంబంధిత శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post