MBNR – మహబూబ్ నగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్

                   @మహబూబ్ నగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
                   ప్రజా ప్రతినిధులు, అధికారులు పరస్పర సహకారంతో మహబూబ్ నగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేద్దామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
                    75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్  పరేడ్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
                    ఈ సందర్బంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి సందేశమిస్తూ మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రస్తుత పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని 10 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునిక వ్యాధి నిర్ధారణ పరికరాలతో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అంతేకాక రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడల్ రూరల్ హెల్త్ యూనిట్ ను జిల్లా లోని జానంపేట లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
                      రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 23 వేల377 మంది రైతులకు 77 కోట్ల 39 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
                       గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రెండవ విడత 16918 మంది లబ్ధిదారులకు 296 కోట్ల రూపాయలతో త్వరలోనే గొర్రెలను అందజేయనున్నట్లు వెల్లడించారు.
                       పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఇప్పటివరకు ఒక వెయ్యి 969 కోట్ల రూపాయలు ఖర్చు చేసిపనులు చేపట్టగా పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.
                        మిషన్ భగీరథ కింద 932 కోట్ల రూపాయల అంచనాలతో1785 పైపు లైన్ల నిర్మాణం,32 ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
                        జిల్లాకు 7668 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా 2456 పూర్తికాగా ,4121 పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.
                        మహబూబ్ నగర్ పట్టణానికి 9.58 కిలోమీటర్ల బై పాస్ నిర్మాణానికి 96 కోట్ల రూపాయలు మంజూరైనట్లు మంత్రి తెలిపారు.18.38 కోట్ల రూపాయలతో మినీ శిల్పారామం,స్మశాన వాటిక,కమ్యూనిటీ,హజ్ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

                        128 కోట్ల రూపాయలతో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్ లు మంజూరు కాగా ఇవన్నీ పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
                        కరోనా నియంత్రణలో భాగంగా 38 వేల మందిని హోమ్ ఐసో లేషన్ లో ఉంచి చికిత్స అందించామని పేర్కొన్నారు.
                        పాలమూరు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు రెండు కోట్ల 8 లక్షల విత్తన బంతులు తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారని, అంతేకాక జిల్లాలోని 441 గ్రామ పంచాయతీలలో వైకుంఠధమాలు,వర్మీ కంపోస్ట్ షెడ్లు, నర్సరీలు,పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు.
                        ఆసరా పెన్షన్ల కింద నెలకు 21 కోట్ల నలభై లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు లింకేజీ కింద 2021- 22 సంవత్సరానికి గాను 259 కోట్ల 25 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
                         జిల్లాలో 11181 కుటుంబ సభ్యులకు 4189 కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు.
                         షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ నట్లు మంత్రి తెలిపారు.

                         భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాది కఅమృత మహోత్సవాలు నిర్వహిస్తున్న శుభ సందర్భంగా జిల్లా అభివృద్ధికి ఇంకా కంకణబద్ధులై ముందుకు కొనసాగాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
                       జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ,ఎం పి మన్నే శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు, జిల్లా జడ్జి ఎస్. ప్రేమావతి, ఎస్ పి. ఆర్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, కే. సీతారామారావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
                       కాగా స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆయా శాఖల ద్వారా నిర్వహించిన శకటాల ప్రదర్శనలో భాగంగా వ్యవసాయ శాఖ మొదటి బహుమతి, మున్సిపాలిటీ రెండవ బహుమతి, డి ఆర్ డి ఎ మూడవ బహుమతి పొందగా వైద్య ఆరోగ్యశాఖ శకటం కన్సోలేషన్ బహుమతి పొందింది.
                       జిల్లావిద్యాశాఖ అధికారి, జిల్లా పౌరసంబంధాల అధికారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
                    అంతేకాక వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రితో పాటు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తిలకించారు.
                    ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను మంత్రి ప్రధానం చేశారు.

Share This Post