MBNR – మహబూబ్ నగర్ నియోజక వర్గం పరిధిలో చేపట్టిన రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

మహబూబ్ నగర్ నియోజక వర్గం పరిధిలో చేపట్టిన రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.
బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన రెండు పడక గదుల ఇల్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.
నియోజక వర్గంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను ఆయా కాలనీలు, గ్రామాల వారిగా జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ , మహబూబ్ నగర్ పట్టణ పరిధిలో ఎస్ వి ఎస్, ఏనుకొండ తదితర ప్రాంతాలలో చేపట్టిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పారు. మహబూబ్ నగర్ గ్రామీణ మండలం మాచన్ పల్లి లో చేపట్టిన 2 బి హెచ్ కె నిర్మాణాలు కూడా తొందరగా పూర్తి చేయాలని, మాచన్ పల్లి,మాచన్ పల్లి తండా ఇళ్ల ను ఒకే సారి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోడూర్ గ్రామంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు. కోడూరు లో నిర్మిస్తున్న ఇళ్ల క్యూరింగ్ కు నీరు కావాలని సంబంధిత ఏ ఈ ,ఏజెన్సీ లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే నీటి సౌకర్యం కల్పించాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఓబులాయ పల్లి,అల్లిపూర్ తదితర గ్రామాలలో నిర్మిస్తున్న ఇండ్ల పురోగతి పై కూడా సమీక్షించారు.
హన్వాడ మండలంలో వివిధ గ్రామాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. మండలంలో చేపట్టిన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్ ,అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏజెన్సీల ప్రతినిధులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

 

 

Share This Post