@మహబూబ్ నగర్ ను మహా నగరంగా తీర్చిదిద్దుతాం
@రాబోయే రోజుల్లో సుందర నగరం గా చేస్తాం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ పట్టణాన్ని మహా నగరంగా తీర్చిదిద్దుతామని, రాబోయే కాలంలో మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో కోటి 48 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ ,సావిత్రిబాయి పూలే, బాలగంగాధరతిలక్, అమరవీరుల స్థూపాలను ఆవిష్కరించారు .
మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమానికి కృషి చేసిన మహాత్మా గాంధీతో పాటు ,బాలగంగాధర్ తిలక్, మహిళా విద్యకు కృషి చేసిన సావిత్రిబాయి పూలే, అలాగే మహిళా ప్రధానిగా విశిష్ట సేవలందించిన ఇందిరాగాంధీ విగ్రహం, తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది అమరవీరుల కు గుర్తుగా అమరవీరుల స్థూపాలను ఆవిష్కరించామని తెలిపారు.
మహబూబ్ నగర్ పట్టణంలో రహదారుల విస్తరణ,బై పాస్ రహదారుల నిర్మాణం,కూడళ్ల అభివృద్ధిని చేపట్టడం జరిగిందని, అదే కాకుండా పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, ప్రత్యేకించి మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, శిల్పారామం, అధునాతనమైన మార్కెట్ల నిర్మాణం,రహదారుల డివైడర్ పై 15 సంవత్సరాల వయసు కలిగిన మొక్కల ఏర్పాటు వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని, భవిష్యత్తులో పట్టణంలో దేనికి కొరత లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, హైదరాబాద్ కు దీటుగా మహబూబ్ నగర్ ను తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ జిల్లా ఎస్ పి ఆర్ వెంకటేశ్వర్లు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి నరసింహులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం మంత్రి అశోక్ థియేటర్ చౌరస్తాలో పెద్ద డ్రైన్ ను,రోడ్డును తనిఖీ చేశారు.