MBNR – మహబూబ్ నగర్ ను మెడికల్ హబ్ గా తీర్చి దిద్దుతాం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ .

మహబూబ్ నగర్ ను మెడికల్ హబ్ గా తీర్చి దిద్దుతాం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ .
వైద్య రంగంలో పని చేసేవారు ఆత్మసాక్షిగా పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
శనివారం మహబూబ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకాంట్రాక్ట్ పద్ధతి పై నూతనంగా నియమించబడిన 33 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ లకు నియామక పత్రాలను అందజేశారు.
వైద్య వృత్తి లో పనిచేసే వైద్యులు, నర్సులు మొదలుకొని ల్యాబ్ టెక్నీషియన్లు ,ఫార్మసిస్ట్ లు ఎలాంటి స్వార్థం లేకుండా వైద్య సహాయం అందించాలని ,సేవలో నాణ్యత పెంచుకోవాలని చెప్పారు. అవసరమైతే గంటసేపు ఎక్కువ పనిచేయాలని, అంతేకాక ఆత్మసాక్షి గా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక వైపు ఆసుపత్రిలో పనిచేస్తూనే ల్యాబ్ టెక్నీషియన్లు ,ఫార్మసిస్ట్ లు ఇతర పోటీ పరీక్షలకు కూడా హాజరై ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉందని తెలిపారు .మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలందరికి మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ప్రతిరోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పై సమీక్ష నిర్వహిస్తున్నరని తెలిపారు. ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం షెడ్లు, కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేస్తున్నామని ,అదేవిధంగా దాతల సహకారంతో తక్కువ ధరకు భోజనం అందించే ఏర్పాటు కూడా చేస్తామని మంత్రి వెల్లడించారు. కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తామని, భవిష్యత్తులో మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా అవుతుందని ఆయన అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,మున్సిపల్ చైర్మన్ కె.సి. నరసింహులు,డి సి సి బి ఉపాధ్యక్షులు కె వెంకటయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, తదితరులు ఉన్నారు.

 

Share This Post