MBNR – మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభించిన డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభించిన డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
@ మరో ఆక్సిజన్ ప్లాంట్ ను త్వరలోనే ప్రారంభిస్తాం
@5 కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ ,జడ్చర్ల ఆస్పత్రులలో చిన్న పిల్లల కోసం ప్రత్యేకించి 32 పడకల కోవిడ్ విభాగాల ఏర్పాటు
@ పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం
@ మహబూబ్ నగర్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తాం- మంత్రి వెల్లడి
సుమారు కోటి రూపాయల వ్యయంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రారంభించారు.
ఈ ఆక్సిజన్ ప్లాంట్ నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. నిమిషం లో వంద పడకల కు సరిపోయే ఆక్సిజన్ ఇందులో తయారవుతుంది .
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో మహబూబ్ నగర్ జిల్లా తాగునీటి తో సహా ఆన్నింటికి సమస్యలు ఎదుర్కొందని, ప్రత్యేకించి వైద్యరంగంలో ఆసుపత్రిలో ఒక్క ఐ సి యు బెడ్ కూడా ఉండేది కాదని, ఇప్పుడు 67 ఐ సి యు పడకల తో పాటు, 567 ఆక్సిజన్ పడకలు ఉన్నాయనితెలిపారు. అంతే కాక ఆక్సిజన్ స్టోరేజ్ ప్లాంట్, ఉత్పత్తి ప్లాంట్ ఉండగా మరో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. చిన్న పిల్లల కోసం 5 కోట్ల రూపాయల వ్యయంతో మహబూబ్నగర్, జడ్చర్ల లో రెండు 32 పడకల చిన్నపిల్లల కోవిడ్ విభాగాలను ప్రారంభించనున్నామని వెల్లడించారు.అంతే కాక పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిని నిర్మించబోతున్నట్టు తెలిపారు.
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అన్ని సౌకర్యాలతో పాటు, మెడికల్ కళాశాలను పి జి స్థాయికి తీసుకువెళతామని మంత్రి తెలిపారు .రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ వైద్య రంగంలో మరిన్ని మార్పులు తీసుకొస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్,డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ,ఆర్ ఎం ఓ డాక్టర్ జీవన్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

 

 

 

Share This Post