MBNR – మహబూబ్ నగర్ లోని రాజ్ వీర్ ఇండస్ట్రీస్ లో పనిచేసే కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని మిల్లు యాజమాన్యానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు.

మహబూబ్ నగర్ లోని రాజ్ వీర్ ఇండస్ట్రీస్ లో పనిచేసే కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని మిల్లు యాజమాన్యానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు.
శనివారం రెవెన్యూ మీటింగ్ హాల్ లో రాజ వీర్ ఇండస్ట్రీస్ యాజమాన్యంతో జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గత ఆరు రోజుల నుండి కార్మికులు సమ్మె చేస్తున్నారని, వారికి రావలసిన బకాయిలు,ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరిశ్రమలో 175 మంది పని చేస్తున్నారని వారు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరగా, సమస్య పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్మికుల సమస్యలపై 14 రోజుల లోపు నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
మానవత్వం తో సమస్య పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు. చట్టపరంగా 330 రోజుల పనిదినాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా యాజమాన్యం త్వరలో సమస్య పరిష్కరించాలని అన్నారు. 24 గంటలు పని కల్పించాల్సి ఉండగా మహిళా కార్మికులకు ఎనిమిది గంటల పని, 10 రోజులు మాత్రమే కల్పిస్తున్నారని మహిళా కార్మికులు తెలిపారని అన్నారు.
ఈ సమావేశంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్ ఐ, తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post