MBNR – మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంగా రెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం,ఎలికట్టకు చెందిన కావలి శ్రీశైలం తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ .వెంకట్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంగా రెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం,ఎలికట్టకు చెందిన కావలి శ్రీశైలం తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ .వెంకట్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు గురువారం కావలి శ్రీశైలం తనను తన ఛాంబర్లో కలిసి నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లుగా రాత పూర్వకంగా తనకు అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. దీంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టి ఆర్ ఎస్ కు చెందిన అభ్యర్థులు కశిరెడ్డి నారాయణ రెడ్డి,కూచుకుళ్ల దామోదర రెడ్డి మాత్రమే మిగిలారు.
రెండు స్థానిక సంస్థల ఎం ఎల్ సి స్థానాలకు కేవలం ఇద్దరు అభ్యర్థులే ఉండడం తో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైందని భావించవచ్చు.

Share This Post