MBNR – మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారికి సహకరించటమే కాకుండా వారికి రక్షణగా మహిళా కమిషన్ నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారికి సహకరించటమే కాకుండా వారికి రక్షణగా మహిళా కమిషన్ నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
బుధవారం ఆమె మహబూబ్ నగర్ లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను తనిఖీ చేశారు.
హాస్టల్ లో ఉంటున్న పని చేసే మహిళకు కల్పిస్తున్న ఏర్పాట్లను తనిఖీ చేశారు. అంతేకాక వంట గదికి వెళ్లి వంటలను రుచి చూశారు. హాస్టల్ లో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు.
అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో మహిళల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించిందని ,ఇవన్నీ వారికి సక్రమంగా అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళలకు ఏ సమస్య వచ్చినా సఖి అందుబాటులో ఉందని,వివిధ అంశాలలో కౌన్సిలింగ్ తొపాటు,మెడికల్ సపోర్ట్ వంటివి సఖి అందిస్తుందన్నారు.7 శాఖలుగా చేసే పని సఖి ద్వారా ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి అన్ని విధాలుగా మహిళలకు అండగా ఉంటున్నదని తెలిపారు.సఖి,వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలోని సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ఏర్పాటు చేస్తామన్నారు.
మహిళా కమిషన్ సభ్యులు సాహీన్ ఆఫ్రిది, కె.ఉమాదేవి,జి పద్మ,ఎస్.లక్ష్మీ, రేవతి, ఆర్ డి ఓ పద్మశ్రీ, జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి ,తదితరులు ఉన్నారు.

Share This Post