MBNR – మాత, శిశు మరణాలు సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు.

మాత, శిశు మరణాలు సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు.
బుధవారం ఆయన తన చాంబర్లో మాతా,శిశు మరణాల పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేసుల వారీగా సమీక్షిస్తూ గర్భిణీ స్త్రీలకు అందించే చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ,ముఖ్యంగా మహిళ గర్భం దాల్చినప్పటినుండి ప్రసవం అయ్యే వరకు అన్ని పరీక్షలతోపాటు, వారు తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని కలెక్టర్ చెప్పారు. గర్భిణీ స్త్రీ తో పాటు, భర్తకు, తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాలను తెలియజేయాలని, అదే విధంగా ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పుడు గమనిస్తూ ఉండాలని, ఈ విషయంలో వైద్యాధికారి మొదలుకొని ఏఎన్ఎం, సిబ్బంది వరకు పూర్తి అప్రమత్తంగా ఉంటే మాత శిశు మరణాలు సంభవించని ఆయన అన్నారు. ఇకపై జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరైనా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎవరైనా కోవిడ్ పాజిటివ్ తో మరణిస్తే తక్షణమే 50 వేల రూపాయల ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేయించాలని కలెక్టర్ సూచించారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ ,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్,ఐ ఎం ఏ జిల్లా అధ్యక్ష్యులు డాక్టర్ రామ్ మోహన్,డాక్టర్ రజని, డాక్టర్ రమాదేవి,రఫీయూద్దీన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post