MBNR – మినీ ట్యాంక్ బండ్ లో చేపట్టిన ఐలాండ్,సస్పెన్షన్ బ్రిడ్జ్, నెక్లెస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి .రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్.

@ మినీ ట్యాంక్ బండ్ లో చేపట్టిన ఐలాండ్,సస్పెన్షన్ బ్రిడ్జ్, నెక్లెస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి .రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్.
ట్యాంక్ బండ్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం ఆయన ట్యాంక్ బండ్ లో చేపట్టిన ఐలాండ్ ,సస్పెన్షన్ బ్రిడ్జి,నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాలు వచ్చే లోపే పనులు పూర్తి కావాలని,ఇందుకు గాను ఎక్కువ టిప్పర్లు,హిటాచి వాహనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకేసారి ఐలాండ్ పనులు, సస్పెన్షన్ బ్రిడ్జి పనులు, పూడికతీత పనులను పూర్తి చేయాలని చెప్పారు. ట్యాంక్ బండ్ వద్ద ఎకరా స్థలంలో ఐలాండ్ నిర్మించాలని, గుర్రపు డెక్క ను పూర్తి స్థాయిలో తీసివేయాలని, సస్పెన్షన్ బ్రిడ్జి పనులు తక్షణమే ప్రారంభించాలని, ట్యాంక్ బండ్ వద్ద పట్టణం మొత్తం కనిపించే విధంగా జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అంతకు ముందు మంత్రి తెలంగాణ చౌరస్తా లోని బ్రహ్మంగారి ఆలయంలో నిర్వహిస్తున్న ఆరాధన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయంలో కిచెన్ షెడ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 5 లక్షల రూపాయల వ్యయం తో నిర్మించిన ఆలయ ప్రహరి గోడను ప్రారంభించారు.ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గోన్నారు.

అనంతరం 12వ వార్డు హనుమాన్ పురం లో 23 లక్షల వ్యయము తో నిర్మించిన సిసి రోడ్డు ను మంత్రి ప్రారంభించారు.
12వ వార్డు బాలాజీ నగర్ లో
13.20 లక్షల వ్యయం తో నిర్మించిన సిసి రోడ్డు ను ప్రారంభించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్, ఇరిగేషన్ ఎస్ఇ నరసింగరావు, ఈ ఈ చక్రపాణి,డి ఈ మనోహర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ , మున్సిపల్ చైర్మన్ కె.సి. నరసింహులు,మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, తాహసిల్దార్ పార్థసారథి, వార్డ్ కౌన్సిలర్లు కిషోర్, రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post