MBNR – మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో హరిత హారం,పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేదించారు.

మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో హరిత హారం,పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేదించారు.
బుధవారం ఆయన రెవెన్యూ సమావేశమందిరంలో మహబూబ్ నగర్,జడ్చర్ల,భూత్పూర్ మున్సిపల్ అధికారులతో సమీక్షించారు.
జడ్చర్ల-మహబూబ్ నగర్,భూత్పూర్-మహబూబ్ నగర్ రహదారులకిరువైపుల బహుళ వరుసలలో మొక్కలు నాటడం ,రోడ్డు మధ్యలో సెంట్రల్ మీడియన్ లో నాటుతున్న మొక్కల పని త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే బై పాస్ రహదారికిరు పక్కల కూడా మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు.
మహబూబ్ నగర్ పట్టణంలో జంక్షన్ల పనులను సమీకిషిస్తూ కోయిల్ కొండ చౌరస్తా,వన్ టౌన్,క్లాక్ టవర్ జంక్షన్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.క్లాక్ టవర్ వద్ద చిరు వ్యాపారులు రోడ్డు పై వ్యాపారం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని,ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతున్నదని అన్నారు.15 రోజులలో పూర్తి చేయాలన్నారు.
టి ఎఫ్ ఐ డి సి,సంపద వనం,బృహత్ పట్టణ ప్రకృతి వనాలు,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం,కళాభారతి,మహబూబ్ నగర్ పట్టణానికి స్వాగత,ధన్యవాదాల తోరణాల ఏర్పాటు పై సమీక్షించారు.
మహబూబ్ నగర్ పట్టణంలో కుక్కల పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు డాగ్ షో నిర్వహించాలన్నారు.
మల్లమ్మ కుంట వ్యవహారం పై సర్వే నిర్వహించాలన్నారు.

స్టానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్ కుమార్,సునీత,నూరుల్ నజీబ్,మున్సిపల్ ఇంజనీర్లు,టౌన్ ప్లానింగ్ అధికారులు, సానిటరి అధికారులు,తదితరులు హాజరయ్యారు.

Share This Post