MBNR – మున్సిపల్ పట్టణ ప్రాంతాలలోని అన్ని కూడళ్ల లో ప్రకృతి రమణీయతను పెంచేలా ల్యాండ్ స్కెప్ లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

మంగళవారం ఆయన జడ్చర్ల బస్టాండ్ సమీపంలోని ఫ్లైఓవర్ కింద ఉన్న కూడలిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జడ్చర్ల ఫ్లై ఓవర్ కూడలిలో పచ్చదనం పెంచాలని,ల్యాండ్ స్కేప్ ఏర్పాటు చేయాలని, గోడలకు పెయింటింగ్ చేయించాలని ,ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ,అవసరమైతే ఎల్ అండ్ టి వారి సహకారం తీసుకోవాలని చెప్పారు. అలాగే జడ్చర్ల నుండి మహబూబ్ నగర్ వెళ్లే రహదారి కి ఇరువైపుల 3 వరుసలలో మొక్కలు నాటినప్పటికి మరో వరుస మొక్కలు నాటాలని, అంతేకాక జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని అన్ని రహదారులకు ఇరువైపులా నాలుగు వరుసల్లో మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే జడ్చర్ల పట్టణంలో చేపట్టిన అన్ని పార్కులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. జంక్షన్ లో అభివృద్ధితోపాటు జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా నియంత్రించాల్సిన అవసరం ఉందని,ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఈ నెల 15వ తేదీన జడ్చర్ల లో గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ముఖ్యంగా వినాయక నిమజ్జనం చేసేందుకు అవసరమైన క్రేన్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వీటితో పాటు జిల్లాలోని మహబూబ్ నగర్ ,భూత్పూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో కూడా అన్ని కూడళ్ల అభివృద్ధితో పాటు, సుందరీకరణ పనులను పూర్తి చేయాలని, ల్యాండ్ స్కేప్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు.జంక్షన్ల అభివృద్ధితో పాటు ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా నియంత్రించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ వెంట జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ సునీత ఉన్నారు.

Share This Post