MBNR – మెట్ట ప్రాంతాలలో ఉద్యాన పంటలకు ప్రాధాన్యం- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు.

@మెట్ట ప్రాంతాలలో ఉద్యాన పంటలకు ప్రాధాన్యం- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యాన పంటలకు అనుకూలమైన భూములు ఉండటంవల్ల ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ పంటల వల్ల రైతులకు అధిక లాభం వస్తుందని అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజాపూర్ మండలం లో బిందు సేద్యం ద్వారా సాగు చేస్తున్న టమాట ,వంకాయ తదితర కూరగాయల పంటలను, పాలీహౌస్ ద్వారా సాగు చేస్తున్న గులాబీ, ఇతర పూల తోటల పెంపకం పంటలను పరిశీలించారు.
బిందు సేద్యం ద్వారా టమాట,వంకాయ తోటలను సాగు చేస్తున్న కుమ్మరి చంద్రయ్య తోటలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు .
అలాగే పాలి హౌస్ పద్దతిలో పందిళ్ళ కింద గులాబీ పెంపకం చేపట్టిన ఆఫీయా బేగం ఉద్యాన తోటను కూడా పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతాలు ఉద్యాన పంటలకు అనుకూలంగా ఉంటాయని, జిల్లాలో ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున ఈ పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఉద్యాన పంటలు, ఉపాధిహామీ కింద కూరగాయల పెంపకానికి పందిళ్ళ వేసుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఆగస్టు 5 తర్వాత మండలాల వారీగా ఈ విషయంపై సమ్మిళిత సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఉద్యాన పంటల దిశగా ఎక్కువ మంది రైతులను ప్రోత్సహించడంలో భాగంగా బిందు సేద్యం, ఉపాధి హామీ పథకం కింద డ్రిప్ ఇరిగేషన్, కూరగాయల పంటలు వేసుకునేందుకు చేయూత ఇస్తామన్నారు.
ఉద్యాన శాఖ డి డి సాయిబాబా,ఉద్యాన శాఖ అధికారిని హిమబిందు, వ్యవసాయ అధికారి నరేందర్ ,ఎం ఐ ఇంజనీర్ నరేష్ ,ఎం ఐ కంపెనీ ప్రతినిధి రఘు, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

Share This Post