MBNR – మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని యూ.బి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నారని, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ సందర్భంగా ముస్లింలకు దుస్తుల పంపిణీ తోపాటు ,ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా బతుకమ్మ చీరల పంపిణీ ,క్రిస్మస్ సందర్బంగా క్రైస్తవులకు దుస్తులు విందు వంటివి చేస్తున్నామని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షునిగా ముస్లిం మైనారిటీ ని నియమించామని, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ను కూడా జిల్లా నుండి ఇచ్చామని, మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా ముస్లింకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
మహబూబ్ నగర్ పట్టణంలో గతంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని ,ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. సుమారు 15 వేల మందికి ప్రతినెల కోటి 50 లక్షల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, ట్యాంక్ బండు ను అభివృద్ధి చేశామని, బైపాస్ రహదారులు,జంక్షన్లు అభివృద్ధి చేశామని, మహబూబ్ నగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున భూముల విలువలు కూడా బాగా పెరిగాయని మంత్రి తెలిపారు. కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాల కింద ఎంతోమంది పేద వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అంతేగాక అనారోగ్యం పాలైన వారికి ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న వారికి కూడా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు.
గతం మహబూబ్ నగర్ కు ఇప్పటి మహబూబ్ నగర్ కు ఎంతో తేడా ఉందని, మైనారిటీల కోసం 6 రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని, మహబూబ్ నగర్ ను ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు,కౌన్సిలర్ వనజ,మార్కెట్ కమిటీ అధ్యక్ష్యులు మహమ్మద్ అబ్దుల్ రహమాన్,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Share This Post