మొక్కల సంరక్షణ లెక్కను సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు పకడ్బందీగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో హైద్రాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ
2019, 2020 సంవత్సరాల లో చేసిన హరితహారం ప్లాంటేషన్ మూల్యాంకనం సెప్టెంబర్ 1 నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ మరియు సంబంధిత శాఖ ద్వారా చేపట్టబడుతుందన్నారు.
జిల్లాల కలెక్టర్లు, ఫారెస్ట్, సంబంధిత అధికారులు హరితహారం మొక్కల గణనకు సంసిద్ధంగా ఉండాలన్నారు. మొక్కల గణనకు టీం లను ఏర్పాటు చేయాలని, మొక్కల గణనకు సంబందించి వివరాలు ఏ రోజుకు ఆ రోజు ఎక్సల్ షీట్లో అప్ లోడ్ చేయాలని ఆమె అన్నారు. అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్సు లో అడిషన్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా అటవీ శాఖ అధికారి గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్ కుమార్,సునీత,నూరుల్ నజీబ్ డిఆర్డిఓ యాదయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.