MBNR – రహదారులకు ఇరువైపులా గ్రీనరీ గా ఉండేలా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

రహదారులకు ఇరువైపులా గ్రీనరీ గా ఉండేలా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.
గురువారం రెవెన్యూ సమావేశ మందిరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో రెజ్యూవనేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ, ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లకు ఇరువైపులా దట్టమైన అడవిల ఉండేలా చెట్లను నాటాలని, అవెన్యూ ప్లాంటేషన్ రెండు లేదా మూడు వరుసలలో చేయాలని అవెన్యూ ప్లాంటేషన్ కోసం గ్రీన్ బడ్జెట్ నుంచి మొక్కలు మాత్రమే కొనుటకు 80% ఖర్చు చేస్తున్నారని, అలా కాకుండా ఇప్పటినుండి నర్సరీలో మొక్కలను పెంచినట్లయితే 20 శాతం మాత్రమే బయటనుండి మొక్కలను కొనుగోలు చేయవచ్చని, గ్రీన్ బడ్జెట్లో మొక్కలు కొనుగోలు చేయుటకు 20 శాతం మాత్రమే వాడాలని మిగతా 80 శాతం బ్యూటిఫికేషన్ ట్రీ గార్డ్స్ వంటి వాటికి ఉపయోగించాలని కలెక్టర్ తెలిపారు. అడవులలో పండ్ల మొక్కలను పెంచాలని, జంతువులకు నీటి తొట్లు, శాసర్ లను ఏర్పాటు చేయాలని, జిల్లాలోని 440 గ్రామ పంచాయతీ నర్సరీలకు స్ప్రింక్లర్ లను అందించుటకు గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, కలెక్టర్ నిధులను విడుదల చేస్తామని, అడవిలో పడే వర్షం వృధా కాకుండా రైతులకు, జంతువులకు ఉపయోగపడేలా రాళ్లతో చెక్ డ్యాములు, కుంటలు, కందకాలు వంటివి ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. మున్సిపాలిటీ లలోనూ హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ ఖాళీ భూములలోను ప్లాంటేషన్ చేయాలని, వీదులలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ సూచించారు. హరితహారం కార్యక్రమం ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ అని, టార్గెట్ను సాధించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
జిల్లా అటవీశాఖ వారు ఏర్పాటుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను జిల్లా కలెక్టర్ తిలకించారు వారు చేస్తున్న కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేర్పులను వారికి కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, జిల్లా అటవీ శాఖ అధికారి గంగారెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో, డిఆర్డిఓ యాదయ్య, సిపిఓ దశరథ్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి, పంచాయతీరాజ్ అధికారి వెంకటేశ్వర్లు, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, జడ్చేర్ల మునిసిపల్ కమీషనర్ సునీత, మునిసిపల్ అధికారులు, అటవీ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post