MBNR – రానున్న దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

రానున్న దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల పండుగను సంబరంగా జరుపుకోలేక పోయామని, అయితే ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లా ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు.
ఆదివారం మంత్రిమహబూబ్నగర్ పట్టణంలోని ఆర్య సమాజ్,దయానంద విద్య మందిర్ లో నిర్వహించిన దసరాఉత్సవ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో దసరా ఉత్సవాలను రాష్ట్రంలోనే బాగా జరుపుకుంటారని, అన్ని జిల్లాల కంటే భిన్నంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని, హిందూ సాంప్రదాయ పద్ధతిలో, ఊరేగింపుగా ,బాణా సంచా కాలుస్తూ నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, డాక్టర్ మురళీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాశ్,జే పీ ఎన్ సి చైర్మన్ రవి కుమార్ తదితరులు హాజరయ్యారు.

Share This Post