MBNR – రానున్న వర్షాకాలంలో హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.

రానున్న వర్షాకాలంలో హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.
సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమం సందర్బంగా ముందుగా అధికారులతో హరితహారం, మన ఊరు- మన బడి, దళిత బంధు,తదితర పథకాల పై సమీక్షించారు.
హరితహారం పై ఈనెల 7వ తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే సమావేశానికి జిల్లా అధికారులు వారి శాఖకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికతో హాజరుకావాలని చెప్పారు. ఈ విడత నీటిపారుదల ,ఆర్ అండ్ బి,పంచాయతీ రాజ్ శాఖల ద్వారా పెద్దమొత్తంలో మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని అన్నారు. రెవెన్యూ, ఎక్సైజ్, ఇరిగేషన్, హార్టికల్చర్,వ్యవసాయ తదితర శాఖల ద్వారా వచ్చే వానా కాలం హరితహారం కింద నాటవలసిన మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు.
హరితహారం పై ఎంపీడీవోలు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా సొసైటీలు, చెరువు కట్ట లపై మొక్కలు నాటెందుకు చర్యలు చేపట్టాలని ,అన్ని గ్రామ పంచాయతీల ద్వారా చెరువు శిఖం ప్రాంతాలలో తుమ్మ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ విడత నీటిపారుదల శాఖ ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆయన ఆదేశించారు . హరితహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి గ్రీన్ బడ్జెట్ ను కేటాయించడం జరిగిందని, జిల్లాలోని 441 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల కు సంబంధించి గ్రీన్ బడ్జెట్ పై వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ప్రతి మండలంలో 5 పల్లె ప్రకృతి వనాలు, మున్సిపల్ స్థాయిలో ప్రతి వార్డు లో ఒక పార్క్ ఉండాలని, నర్సరీలలో పొడవాటి మొక్కలను పెంచేలా చర్యలు తీసుకోవాలని, మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్, అటవీ శాఖ అధికారులు చేపట్టిన నర్సరీలో పెద్దపెద్ద మొక్కలను పెంచడం జరిగిందని, అలాంటి మొక్కలు అన్ని గ్రామ పంచాయితీలలో పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. హరితహారం కార్యక్రమం ప్రారంభించే నాటికి మొక్కలు నాటేందుకు స్థలాల గుర్తింపు,గుంతల తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన ఆదేశించారు.
మన ఊరు- మన బడి పై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో 291 పాఠశాలలో పనులు చేపడుతుండగా, 281 పాఠశాలలకు అంచనాలు పూర్తి చేయడం జరిగిందని, పరిపాలన అనుమతులు మంజూరు అయి ఒప్పందం పూర్తయిన 47 పాఠశాలల్లో వెంటనే పనులు చేపట్టాలని చెప్పారు. కనీసం ప్రతి మండలంలో 5 పాఠశాలలల్లో పనులు ప్రారంభం కావాలని, ఇందుకుగాను అవసరమైన ఇసుకకు ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. జూన్ లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులన్నీ పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. పనులకు సంబంధించి మండల స్థాయి బృందాలు ప్రత్యక్ష బాధ్యత తీసుకోవాలని కోరారు. మన ఊరు- మనబడి అంచనాలు ఖచ్చితంగా తయారు చేసి పంపాలని సూచించారు.
దళితబంధు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఎస్ సి లు,దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఇక పై ప్రతి నెల మొదటి వారం,మొదటిరోజు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవిన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post