MBNR – రాష్ట్రంలోని ఆడపడుచులందరు సంతోషంతో పండగ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

రాష్ట్రంలోని ఆడపడుచులందరు సంతోషంతో పండగ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కేంద్రంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
82 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం కింద 82 లక్షల 9 వేల 500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అంతేకాక 159 మంది మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద నాలుగు కోట్ల 26 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు .
గతంలో గ్రామాలలో అనేక సమస్యలు ఉండేవని ,ముఖ్యంగా విద్యుత్ కు తాగునీటికి కొరత ఉండేదని ,2014 కు పూర్వం మైళ్ల దూరం నుండి తాగునీరు తెచ్చుకునే వారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు తాగునీటి ఇస్తున్నామని, రైతుల సంక్షేమం లో భాగంగా రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామని, ఆపద వచ్చిన అందరిని ఆదుకుంటున్నామని, ముఖ్యంగా అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నామని తెలిపారు .
అన్ని పండుగలను సంతోషంగా చేసుకునేలా చూస్తున్నామని, ప్రత్యేకించి బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం ద్వారా మహిళలు సంతోషంగా పండగ చేసుకునేలా చూస్తున్నామాని తెలిపారు.హన్వాడ మండలానికి 18400 చీరలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఆర్డిఓ పద్మశ్రీ, ఎంపిటిసి బాలరాజు, జడ్పిటిసి విజయనిర్మల , తాహసిల్దార్ బక్క శ్రీనివాసులు, ఎంపిడిఓ ధనుంజయ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Share This Post