MBNR – రాష్ట్రంలో కుల వృత్తులను పునరుద్ధరించడమే కాక ఆధునికరిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

రాష్ట్రంలో కుల వృత్తులను పునరుద్ధరించడమే కాక ఆధునికరిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గురువారం ఆయన మహబూబ్ నగర్ లోని మత్స్యశాఖ కార్యాలయ ఆవరణంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా ఎం. సత్యనారాయణ బాధ్యతలను స్వీకరించగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కుల వృత్తులకు ప్రాధాన్యం వచ్చిందని , గతంలో కుల వృత్తులపైనే అందరు ఆధారపడి జీవించే వాళ్ళని, అయినప్పటికీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదల ఉండేదికాదని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులకు కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం కేటాయించగా అది ఇప్పుడు 4,5 వేల కోట్లకు చేరిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులవృత్తులను పునరుద్ధరించడంతోపాటు, ఆధునికరిస్తున్నదని అన్నారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే మత్స్యకారులకు ప్రభుత్వం సుమారు 2000 వాహనాలు, నెట్లు, ఫ్రీజర్లు, మోపెడ్ లు ఇచ్చిందని, 11,500 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించినట్లు తెలిపారు .గతంలో మత్య కార కాంట్రాక్టర్లు మత్స్యకారులకు చేప పిల్లలను ఇచ్చి మత్స్య సంపదపై వచ్చే ఆదాయం అంతటిని వారు తీసుకొని మత్స్యకారుల శ్రమను దోచుకునే వారని అలాంటిది ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లల పంపిణీతో పాటు, అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు. మత్స్యకారులు చదువుకోవాలని ఇందుకు ప్రభుత్వం గురుకులాలను స్థాపించిందని, అన్ని కులాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వమే మత్స్యకారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నదని , స్థానిక మత్స్య సంఘాలకు సహకారం అందిస్తున్నదని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, ప్రజలు సుఖ,సంతోషాలతో ఉన్నారని తెలిపారు.
దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మత్స్య సహకార సంఘాలకు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారని, వీటిని మత్స్యకారులు ఉపయోగించుకోవాలని కోరారు.
జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ఎం. సత్యనారాయణ పదవి బాధ్యతలను స్వీకరించారు. అంతేకాక సమావేశానికి అధ్యక్షత వహించారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్ ,జిల్లా రైతుబంధు కో-ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, గొర్రె కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్ వెంకన్న, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, ఎంపిపి శేఖర్ రెడ్డి, డిసిసిబి ఉపాధ్యక్షులు కొరమాని వెంకటయ్య, కౌన్సిలర్ కిషోర్, ముదిరాజు రాష్ట్ర నాయకులు మనోహర్, జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులు రాధారోహిణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

Share This Post