MBNR – రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ట్యాంక్ బండ్ (పెద్ద చెరువు) అభివృద్ధిలో బాగంగా నూతనంగా సస్పెన్షన్ బ్రిడ్జి ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలలో బాగంగా నేడు టూరిజం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ట్యాంక్ బండ్ (పెద్ద చెరువు) అభివృద్ధిలో బాగంగా నూతనంగా సస్పెన్షన్ బ్రిడ్జి ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలలో బాగంగా నేడు టూరిజం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మహబూబ్ నగర్ పట్టణ సుందరీకరణ లో బాగంగా పట్టణంలో పురాతన చెరువు అయిన పెద్ద చెరువు ను ఆధునిక రీతిలో అభివృద్ధి చేసి మినీ ట్యాంక్ బండ్ తో పాటు సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ లను అభివృద్ధి చేయడంతో పాటు పెద్ద చెరువు లోని నూతనంగా ఐలాండ్ ను ఒక ఎకరం విస్తీర్ణంలో నిర్మించి ట్యాంక్ బండ్ ను కలుపుకుని ఐలాండ్ వరకు నూతనంగా అత్యద్భుతంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సస్పెన్షన్ బ్రిడ్జి ని నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలను, నమూనాలను పర్యాటక శాఖ MD మనోహర్ గారితో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..మహబూబ్ నగర్ పట్టణం హైదరాబాద్ నగరానికి సమాంతరంగా అభివృద్ధి జరిపే కార్యక్రమంలో భాగంగా పట్టణాన్ని సుందరి కరణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం, శిల్పారామం ఏర్పాటు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టూరిజం MD మనోహర్, టూరిజం అధికారులు సత్యనారాయణ, అదిల్, ఇంజినీరింగ్ అధికారులు,సాంకేతిక సిబ్బంది ,టూరిజం అధికారులు పాల్గొన్నారు.

Share This Post