MBNR – రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు .
ప్రజావాణి ఫిర్యాదులతో పాటు, ఆయా ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై సమీక్షించారు. అంతేగాక జూన్ 2వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పై మాట్లాడుతూ ఈ విడత రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు.
ఈ సంవత్సరం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ హాజరవుతారని, ముందుగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నున్న అమర వీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారని, అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని వెల్లడించారు.
కాగా సోమవారం 74 ఫిర్యాదులు రాగా వీటిలో భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, తదితర అంశాలకు సంబంధించిన పిర్యాదులు ఉన్నాయి.
జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు రాష్ట్రవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై మాట్లాడారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామారావు, జిల్లా అధికారులు హాజరయ్యారు.

 

 

 

Share This Post