MBNR – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు స్టేడియం లో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను నెల రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు స్టేడియం లో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను నెల రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.
శుక్రవారం ఆయన మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం,స్విమ్మింగ్ పూల్,ఎం వి ఎస్ కళాశాలలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీనివాస స్టేడియం నిర్మాణ పనుల పై అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అదే విధంగా స్విమ్మింగ్ పూల్ మరమ్మతు పనులను కూడా పూర్తి చేయాలన్నారు. ఇండోర్ స్టేడియంలో చేపట్టిన 400 మీటర్ల ట్రాక్, రహదారుల విస్తరణ ,సిసి రోడ్ల నిర్మాణం, ఆర్చ్ నిర్మాణం వంటివి వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎం వి ఎస్ కళాశాల మైదానంలో చేపట్టిన శ్రీనివాస స్టేడియం నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్ రెడ్డి, టి ఎస్ ఎమ్ ఐ డి సి ఈ ఈ జైపాల్ రెడ్డి, ఈ డబ్ల్యూ ఐ డి సి డిఈ రాములు, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

 

Share This Post