MBNR – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గారి మాతృ మూర్తి శ్రీమతి వి. శాంతమ్మ గారు ఈ నెల 29 న హైద్రాబాదులో గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గారి మాతృ మూర్తి శ్రీమతి వి. శాంతమ్మ గారు ఈ నెల 29 న హైద్రాబాదులో గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే.
కాగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మహబూబ్ నగర్లోని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గారి గృహంలో మంత్రి గారి మాతృ మూర్తి కీర్తి శేషులు శ్రీమతి శాంతమ్మ గారి చిత్ర పటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.శ్రీమతి వి .శాంతమ్మ మరణం పట్ల తన సంతాపం తెలిపారు.ఎక్సైజ్ శాఖ మంత్రి ని పరామర్శించి ప్రఘాడ సానుభూతిని వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ వెంట ,జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ,జిల్లా ఎస్ పి ఆర్ .వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Share This Post