MBNR – రాష్ట్ర పర్యాటక ,సాంస్కృతిక, క్రీడలు,ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ సమీపంలోని పిల్లల మర్రి లో ప్రస్తుతం ఉన్న ఆర్కేలాజికల్ మ్యూజియం పక్కన ఆర్కియాలాజికల్ పార్కు నిర్మాణానికై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.

రాష్ట్ర పర్యాటక ,సాంస్కృతిక, క్రీడలు,ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ సమీపంలోని పిల్లల మర్రి లో ప్రస్తుతం ఉన్న ఆర్కేలాజికల్ మ్యూజియం పక్కన ఆర్కియాలాజికల్ పార్కు నిర్మాణానికై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.
ఆర్కెయాలాజికల్ పార్క్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. అంతేకాక నిర్మాణంలో చేపట్టనున్న పనులపై సంబంధిత అధికారుల బృందం మంగళవారం పిల్లలమర్రి లోని ఆర్కియాలాజికల్ మ్యూజియం ను ,పక్కనే ఉన్న స్థలాన్ని సందర్శించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్కియాలజికల్ పార్కు లో చేపట్టబోయే నిర్మాణాలపై కలెక్టర్ సమీక్షించారు.
అనంతరం జిల్లాలో పర్యాటక అభివృద్ధి లో భాగంగా సర్క్యూట్ లను ఏర్పాటు చేయాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు ను ఆదేశించారు.
ముందుగా స్థానికంగా పర్యాటకుల కోసం ఒకరోజు, అదేవిధంగా హైదరాబాద్ నుండి వచ్చే పర్యాటకుల కోసం రెండు రోజుల టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని సూచించారు.ఎకో పార్క్, పిల్లలమర్రి, మన్యంకొండ, కురుమూర్తి, కోయిల్సాగర్ లతో కలుపుకొని ఒకరోజు టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని, అలాగే రెండో రోజు సర్క్యూట్ కు సంబంధించి కందూరు, బీచ్ పల్లి ,గద్వాలకోట, జూరాల ప్రాజెక్టు, అలంపూరు దేవాలయాల సందర్శన తో కూడుకొని ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్కియాలజికల్ ఏ డి బుజ్జి, జిల్లా పర్యాటక శాఖ అధికారి.యు వెంకటేశ్వర్లు ,ఉద్యాన శాఖ జిల్లా అధికారి సాయిబాబా, టి ఎస్ ఎం ఐ డి సి ఈ ఈ జైపాల్ రెడ్డి, అర్బన్ తాహసిల్దార్ పార్థసారథి, ఆర్ టి సి అధికారులు తదితరులు హాజరయ్యారు.

Share This Post