MBNR – రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు ప్రాంతంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన దూద్ ధవాఖానను ప్రారంభించారు. అంతేకాక ఇదే భవనం పై అంతస్తులో ఏర్పాటుచేసిన మహిళా కేంద్రాన్ని ప్రారంభించారు.
పాత పాలమూరు,వీరన్న పేట, బండ్ల గేరి,బ్రహ్మాన్ వాడి తదితర ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా నూతనంగా నిర్మించిన దూద్ దవాఖానాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మంత్రి అన్నారు. ముఖ్యంగా నూతన దూద్ దవాఖాన ఆస్పత్రిలో చుట్టుపక్కల ఉండే పేదలు ముఖ్యంగా మహిళలు ,చిన్న పిల్లలు, వృద్ధులు ,కనీసం నెలకు ఒకసారైనా వారి ఆరోగ్యాలను డాక్టర్ చేత పరీక్షించుకోవాలని తెలిపారు. ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు మహిళ డాక్టర్, చిన్నపిల్లల డాక్టర్ ఉండేలా చూస్తామని, రక్త పరీక్షలకు శాంపిళ్ళు సేకరించే విధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేస్తామని, సాధారణ కాన్పులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని, అదేవిధంగా పాత కలెక్టరేట్ స్థానంలో 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నామని తెలిపారు.దూద్ దవాఖాన అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇందుకుగాను అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ,ప్రతిరోజు రక్త పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ టెక్నీషియన్ ను ఏర్పాటు చేయాల్సిందిగా డి ఎం హెచ్ ఓ ను ఆదేశించారు.
మహిళలు ఆన్ని రకాలుగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మహిళా కేంద్రంలో అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ముందుగా వచ్చే వారమే 25 నుండి 30 కుట్టు మిషన్లు ఏర్పాటు చేస్తామని, మగ్గం, ఎంబ్రాయిడరీ,జర్దోషి వంటి వాటి పై మహిళలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. మహిళలు శిక్షణ పొంది మంచి డిజైన్ల తో ఆర్థికంగా స్థిరపడాలని మంత్రి సూచించారు .ఈ మహిళ కేంద్రంలో మంచి డిజైన్ లతో మిషన్ వర్క్ చేస్తారన్న పేరు తెచ్చుకోవాలని ఈ కేంద్రం ప్రతి మహిళకు బ్రతుకుదెరువు ఉండేలా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.
జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ ,మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్ ,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్ ,స్థానిక కౌన్సిలర్ వేద వ్రత, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

Share This Post