MBNR – రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతి సంవత్సరం దసరా పండుగకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రేడలు,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతి సంవత్సరం దసరా పండుగకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రేడలు,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ మినీ స్టేడియంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా గతంలో అనేక సమస్యలను ఎదుర్కొని ప్రస్తుతం పాడిపంటలతో కళకళ లాడుతున్నదని, అన్ని కులాల వారు సంతోషంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా మత్స్యకారుల సంక్షేమానికి 350 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నదని ,రైతు బంధు, రైతు బీమా, వంటి పథకాల కింద రైతుల కోసం కృషి చేస్తున్నదని , కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్,పింఛన్లు తదితర పథకాల కింద అందరిని ఆడుకొంటున్నదని,దీనివల్ల ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగిందని, ఒక భరోసా వచ్చిందని తెలిపారు .
మహబూబ్ నగర్ ను హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దుతామని, ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు .పాత కలెక్టరేట్ స్థానంలో 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేస్తున్నామని, మూడు నెలల్లో టెండర్లు కూడా పిలుస్తామని మంత్రి వెల్లడించారు.
ఎం పి మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని బడుగు బలహీన వర్గాల వారు, కుల వృత్తుల వారు సంతోషంగా ఉన్నారని, పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉందని,తెలంగాణ సంస్కృతి అందరికీ ఉట్టి పడేలా ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నదని, మహిళలు బాధపడకూడదనే ఉద్దేశంతో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నదని, గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు మాట్లాడుతూ కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగను సరిగా నిర్వహించుకోలేదని, ఈ సంవత్సరం అందరు కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నదని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, మున్సిపల్ కమిషనర్ నరసింహులు, ఎంపీపీ సుధా శ్రీ,జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ ,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, సర్పంచులు డిఆర్డిఓ యాదయ్య ,ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post