MBNR – రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి లో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు.ఇప్పటివరకు రుణాలు పొందని 2000 మంది కొత్త రైతులకు 21 కోట్ల రూపాయల పంట రుణాల చెక్కులు అందజేశారు.
రైతులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం ఉచిత విద్యుత్, సాగునీరు ,రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీ ఎరువులు ,విత్తనాల వంటివి ఇస్తున్న దని, అంతేకాక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా సమయంలో కూడా దాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు .
2014 కు ఇప్పటికి రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలన్నారు.మహబూబ్ నగర్ ను భవిష్యత్తులో ఎవరూ ఊహించని విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దివిటి పల్లి,అంబట్ పల్లి లను మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు కానుందని,దివిటి పల్లికి రెండు డివిజన్లు వస్తాయని, మున్సిపాలిటీ లో కలిస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని మంత్రి అన్నారు.
దివిటి పల్లి ప్రాంతంలో ఐటీ కారిడార్,బై పాస్, జాతీయ రహదారితో పాటు రానున్న రోజులలో కరివేన రిజర్వాయర్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని, దివిటిపల్లి లో మరో పెద్ద బస్టాండ్ ఏర్పాటు అవుతుందని మంత్రి తెలిపారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రాలు అమలు చేస్తున్నదని, గతంలో వలస వెళ్లిన రైతులు ఇప్పుడు పట్టణాలనుండి వాపస్ వస్తున్నారని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధా శ్రీ, వైస్ ఎంపీపీ అనిత, కౌన్సిలర్ యాదమ్మ, రామాంజనేయులు ,సర్పంచ్ జరీనా బేగం తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి రైతు వేదిక వద్ద మొక్కలు నాటారు.వ్యవసాయ పని ముట్లు పరిశీలించారు.

Share This Post