MBNR – రాష్ట్ర ప్రభుత్వం 90 వేల ఉద్యోగాల భర్తీకి కొలువుల కుంభమేళ ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 90 వేల ఉద్యోగాల భర్తీకి కొలువుల కుంభమేళ ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు.
సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్ పో ప్లాజా లో శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రూప్స్ పరీక్షలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు.
మహబూబ్ నగర్ పట్టణం వేగంగా రూపురేఖలు మార్చుకుంటున్నదని, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణాన్ని ఇంకా బాగు చేసేందుకు తపన పడుతున్నారని , పట్టణ అభివృద్ధికి మున్సిపల్ శాఖ తరఫున అవసరమైన నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ లో కొలువుల కుంభమేళ ప్రకటించారని, ఇందులో భాగంగా 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ నేపథ్యంలో శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తూ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.
గ్రూప్ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు 6 నెలలపాటు, వాట్సప్, ఫేస్బుక్ జోలికి వెళ్లకుండా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి , అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కె సి నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Share This Post