MBNR – రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని రిటైల్ మద్యం షాపులకు లాటరీ ద్వారా పూర్తి పారదర్శకంగా ఎంపిక కార్యక్రమాన్నీ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని రిటైల్ మద్యం షాపులకు లాటరీ ద్వారా పూర్తి పారదర్శకంగా ఎంపిక కార్యక్రమాన్నీ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు.
శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అప్పనపల్లి సమీపంలోని వైట్ కన్వెన్షన్ లో నిర్వహించిన లాటరీ ద్వారా రిటైల్ మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిగా పారదర్శకతతో మద్యం దుకాణాల ల్యాటరీని నిర్వహించామని, మహబూబ్ నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో మొత్తం 90 షాపులు ఉండగా , మహబూబ్ నగర్, జడ్చర్ల ,కోస్గి, నారాయణపేట ప్రాంతాలలో ఇవి ఉన్నాయని తెలిపారు .అయితే వీటిలో రెండు షాపులకు మాత్రం ల్యాటరీ తీయటం లేదని,వాటికి దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటి లక్కీ డ్రా ను నిలిపి వేయడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత వీటికి కూడా లక్కీ డీప్ తీస్తామని, అందువల్ల ఈ షాపులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమ్యూనిటీ లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేస్తూ వాటన్నింటికి కలిపి శనివారం లక్కీ డ్రా నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలోని మద్యం షాపులను ఏలాంటి రాగద్వేషాలకు తావివ్వకుండా పూర్తి స్వేచ్ఛ గా, పారదర్శకంగా లాటరీ ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ,జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఖురేషి ,ఎక్సైజ్ అధికారులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share This Post