MBNR – రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగులకు సంబంధించి స్థానిక క్యాడర్ కేటాయింపుల విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగులకు సంబంధించి స్థానిక క్యాడర్ కేటాయింపుల విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.
మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపు పై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపు విషయంలో ప్రభుత్వ ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేయాలని, ఇందుకు జిల్లా అధికారులు అందరూ సహకరించాలని కోరారు .ఈ విషయంలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఉద్యోగుల కేటాయింపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినదై ఉంటుందని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నేపథ్యంలో ఏ జిల్లాకు ఏ సిబ్బందిని కేటాయించాలన్నది ప్రభుత్వం స్పష్టంగా నిబంధనలను జారీ చేసిందని, ఈ మేరకు ఈ నెల 6వ తేదీన ప్రభుత్వం 317 జి ఓ జారీ చేసినట్లు వెల్లడించారు. . ఉద్యోగుల కేటాయింపు విషయంలో ఎస్ సి ఎస్ టి,వితంతు, వైద్య కారణాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అధికారులు వారి పరిధిలో ఉమ్మడి జిల్లాలో పని చేసే ప్రతి ఉద్యోగి నుండి ఐచ్చికాలను తీసుకోవాలని, రేపు సాయంత్రం లోగా అన్ని క్రోడీకరించి ప్రభుత్వం నిర్దేశించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, ఇందుకుగాను ముందుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కేటగిరీల వారీగా ఉద్యోగుల సీనియార్టీ జాబితాను రూపొందించాలని చెప్పారు. మొత్తం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తప్పులు దొర్లకుండా పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జేఏసీ నుంచి హాజరైన జేఏసీ ప్రతినిధి రాజివరెడ్డి, రెవిన్యూ అసోసియేషన్ తరఫున రాజగోపాల్,గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, వారి అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాకుండా, కొన్ని విషయాలలో సూచనలు సలహాలను అందజేశారు .
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా అధికారులు, రెవెన్యూ ఉద్యోగులు సంఘం అధ్యక్ష్యులు చెన్న కిష్టన్న, రాజేష్, ఎన్ జి ఓ ల కార్యదర్శి చందర్ నాయక్,నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష్యులు నరేందర్, ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post