MBNR – రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని వైన్ షాప్ లను ఆయా కమ్యూనిటీ వారిగా లాటరీ ద్వారా కేటాయించేందుకు గాను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా షాపులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని వైన్ షాప్ లను ఆయా కమ్యూనిటీ వారిగా లాటరీ ద్వారా కేటాయించేందుకు గాను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా షాపులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ పాలసీపై ఎక్సైజ్ అధికారులతో పాటు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ నెల 8న ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయా కులాలకు లాటరీ ద్వారా వైన్ షాపులు కేటాయించేందుకు అధికారుల సమక్షంలో షాపులను గుర్తించే సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ,జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి, ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి, డి టి డి వో లు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ఆయా కులాల వారిగా వైన్ షాపుల కేటాయింపుకు గుర్తించే ప్రక్రియ మొత్తాన్ని వీడియో, ఫోటోగ్రఫీ ద్వారా రికార్డు చేయాలని ఆదేశించారు.
కాగా వైన్ షాపులను గౌడ కమ్యూనిటీ కి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్ టి లకు 5 శాతం కేటాయించాలని ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కే .సీతారామారావు, జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ సైదులు, డి టి డి ఓ చ
చత్రు తదితరులు హాజరయ్యారు.

Share This Post