MBNR – రైతులు యాసంగి లో వరి కన్నా మెరుగైన , ఆర్థిక స్వావలంబన కల్పించే పంటలను వేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు కోరారు.

రైతులు యాసంగి లో వరి కన్నా మెరుగైన , ఆర్థిక స్వావలంబన కల్పించే పంటలను వేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు కోరారు.
ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా ,భూత్పూర్ మండలం, షేర్ పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ముఖ్య అథితిగా హాజరయ్యారు .
యాసంగి లో వరి ధాన్యం కొనుగోలు కు అవకాశం లేనందున రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. ఇందుకుగాను అనేక ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయని, ముఖ్యంగా మినుము, పెసర, చిరుధాన్యాల తో పాటు ,ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని చేపట్టాలని చెప్పారు. ఆయిల్ పామ్ పెంపకం వల్ల ఎంతో లాభం వస్తుందని, టన్నుకు 18 వేల రూపాయలు సాధించేందుకు అవకాశం ఉందని,3 సంవత్సరాల నుండి పంట దిగుబడి వస్తుందని, అందువల్ల రైతులు అదును చూసి పంటలు సాగు చేసుకుని లాభపడాలని విజ్ఞప్తి చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకానికి అనువైన పొలాలు ఉన్నాయని, ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ తోటల పెంపకం పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నదని ,ప్రత్యేకించి దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి కూడా భూత్పూర్ మండల కేంద్రానికి దగ్గర్లోనే ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని, వీలైతే రైతులు ఒకసారి ఆ పంటను చూసి అవగాహన కల్పించుకుని ఆయిల్ పామ్ తోటల పెంపకం చేపట్టాలని అన్నారు. మినుము, పెసర తో పాటు, చిరు ధాన్యాలు, పప్పు దినుసులు వంటి అనేక పంటల వల్ల వరి కన్నా మెరుగైన, ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని అన్నారు. వీటన్నిటి గురించి తెలియజేసేందుకు ప్రస్తుతం ప్రతి మండలానికి వ్యవసాయ అధికారి తోపాటు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారని అన్నారు. రైతులు అవసరమైన పంటలను సాగు చేసేందుకు ఇదివరకే విత్తన డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగిందని, అవసరమైన విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయని ,కొన్ని విత్తనాలను సబ్సిడీపై ఇస్తున్నామని,రైతులందరు కలిసి ముందుకు వస్తే ఒక యూనిట్ గా విత్తనాలు మంజూరు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.డిమాండ్ ఉన్న పంటలను వేసి రైతులు మంచి లాభాలు పొందాలని, ప్రభుత్వం రైతులకు రైతు బంధు, రైతు భీమా తో పాటు, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాకుండా, చెక్ డ్యాములు, చెరువులు , సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందజేస్తున్నదని, రైతులు ఆయా పంటల పై అవగాహన కల్పించుకోని సాగు చేయాలని కోరారు.
భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి ,వ్యవసాయ అధికారి ,వ్యవసాయ విస్తరణ అధికారి, డిప్యూటీ తాసిల్దారు రాజీవ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్ , తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share This Post