MBNR – రైతులు లాభదాయక పంటలను సాగు చేయాలని, నేల , నీరు, వాతావరణ పరిస్థితులను బట్టి ఎలాంటి పంటలు వేస్తే లాభం వస్తుందో అలాంటి పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు కోరారు.

రైతులు లాభదాయక పంటలను సాగు చేయాలని, నేల , నీరు, వాతావరణ పరిస్థితులను బట్టి ఎలాంటి పంటలు వేస్తే లాభం వస్తుందో అలాంటి పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు కోరారు.
మంగళవారం ఆయన మహబూబ్ నగర్ గ్రామీణ మండలం ఇప్పలపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే యాసంగిలో భారత ఆహార సంస్థ వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు సుముఖంగా లేనందున, జిల్లాలోని రైతులు యాసంగిలో మినుము, వేరుశనగ, పెసర్లు, నూనె గింజల తోతలను పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా చాలా మంది రైతులు నేల, నీరు ,మాత్రమే చూస్తున్నారని, అలా కాకుండా వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేయాలని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, రైతులకు ఏ పంట వేస్తే మేలు జరుగుతుందో ఆలోచించుకుని అలాంటి పంటలు సాగు చేయాలని అన్నారు. నిరంతరం వరి లాంటి పంటను సాగు చేయడం వల్ల భూసారం కోల్పోయి పంట దిగుబడి తగ్గిపోతుందని, దీనివల్ల రైతులు తప్పనిసరిగా ఒక్కసారైనా పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. వరి కొనుగోలు లో ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, అదేవిధంగా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు . స్వంత వినియోగం కోసం, మిల్లర్లు తో ఒప్పందం చేసుకొని ఉంటే, విత్తనాల కోసం మాత్రమే వరి పంటను సాగు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.
వ్యవసాయ శాస్త్రవేత్త రాజమణి , గాజులపేట సర్పంచ్ చంద్రశేఖర్, రైతు రామకృష్ణారావు తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు ప్రస్తుతం సేకరిస్తున్న వానాకాలం వారి ధాన్యానికి సంబంధించిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే సమస్యలను జిల్లా కలెక్టర్ పరిష్కరించారు.
ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ వెంకటయ్య ,తాహసిల్దారు పాండు, వ్యవసాయ అధికారిని ఇస్రత్ సుల్తానా, వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామంలో ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ వేసుకొనని వెంకటరామిరెడ్డి,రేమాబి లను అక్కడికి పిలిపించి వ్యాక్సినేషన్ వేయించారు.

Share This Post