MBNR – రైతు బంధు సంబరాలతో తెలంగాణలో ముందే సంక్రాంతి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్.

రైతు బంధు సంబరాలతో తెలంగాణ లో ముందే సంక్రాంతి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
గడచిన 15 రోజుల నుండి తెలంగాణ లో రైతు బంధు సంబరాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ గ్రామీణ మండలం కోడూరు నుండి మన్యం కొండ స్టేజ్ వరకు రైతుబంధు సంబరాల సందర్భంగా నిర్వహించిన భారీ ట్రాక్టర్ ర్యాలీ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అనంతరం కోడూరు రైతు వేదిక లో మంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి అన్నం పెట్టే రైతు నీతి తప్పడని, అలాంటి రైతును కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గతంలో రైతులు సాగునీటికి ,విద్యుత్ కు, విత్తనాలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ పనిచేస్తున్నారని , ఉచిత విద్యుత్ తో పాటు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, రైతు బీమా, ఇచ్చి రైతు ను రాజును చేయాలన్న కలలను నెరవేరుస్తున్నారని ఆన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలు చేస్తున్నామని, పేదల ఆర్థిక పరిస్థితులు మారిపోయాయని, గ్రామాలు కళకళలాడుతున్నాయని , 2014 కు ముందు మహబూబ్ నగర్ జిల్లా తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నదని, ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత కరెంటు ఇస్తున్నామని, ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రైతు ప్రజలను ప్రభావితం చేసే స్థాయికి రైతు వచ్చాడని తెలిపారు.
ప్రభుత్వం ప్రజల కోసం, రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలను రైతుబంధు ప్రతినిధులు ,వ్యవసాయ అధికారులు,పి ఏ సి ఎస్ ప్రతినిధులు గ్రామ గ్రామాన తెలియజేయాలని అన్నారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ ను హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దుతామని, ఎన్ని శక్తులు అడ్డొచ్చిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రైతు బంధు పథకం కింద ఒక్క మహబూబ్ నగర్ నియోజకవర్గానికె 200 కోట్ల రూపాయలను, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1460 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని తెలిపారు.
అనంతరం మంత్రి రైతుబంధు సంబరాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్ ,రైతుబంధు జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్, రైతు బంధు డైరెక్టర్ మల్లు నరసింహా రెడ్డి, తదితరులు మాట్లాడారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డిఓ పద్మశ్రీ, జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ ,ఎం పి పి సుధా శ్రీ, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు, రైతుబంధు మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, జె పి ఎన్ సి చైర్మన్ రవి కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, ఆంజనేయులు ,సర్పంచ్ చంద్రకళ, పిఎసిఎస్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
రైతులు స్వచ్ఛందంగా వందలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.

 

 

 

 

 

Share This Post