MBNR – రైతు బజార్ లో ఒకే చోట వెజ్, నాన్ వెజ్ ప్రజలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

              రైతు బజార్ లో ఒకే చోట వెజ్, నాన్ వెజ్ ప్రజలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
              మంగళవారం పట్టణంలోని తూర్పు కమాన్ వద్ద ఉన్న రైతు బజార్ ను మంత్రి ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.
ఒకే చోట వెజ్ మరియు నాన్ వెజ్ లభించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అతి చేరువలో ఉన్న ఈ రైతు బజార్ లోనే మటన్, చికెన్, చేపలు, కూరగాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఇక్కడ కూరగాయలు మాత్రమే లభిస్తున్నాయని, నాన్ వెజ్ మార్కెట్ నిర్వహించుటకు కావాల్సిన నీళ్లు, ఇతర అవసరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని మంత్రి సంబంధిత మార్కెటింగ్ అధికారులకు ఆదేశించారు.
               అనంతరం పునర్నిర్మిస్తున్న అబ్దుల్ ఖాదర్ దర్గాను మంత్రి పరిశీలించారు, చేయవలసిన మార్పులు, చేర్పులు సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. లైటింగ్ ఏర్పాట్లను మునిసిపాలిటీ అధికారులు చేయవలసిందిగా అధికారులకు ఆదేశించారు.
               అనంతరం మత పెద్దల సమక్షంలో దర్గాలో ధట్టి కప్పి ప్రార్ధనలు చేశారు.
               తదనంతరం బండ్లగేరి మరియు క్లాక్ టవర్ వద్ద జంక్షన్ ల పురోగతి పనులను మంత్రి పరిశీలించారు. పనులు, పెయింటింగ్ వంటివాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత మున్సిపల్ అధికారుల ను మంత్రి ఆదేశించారు.
               మున్సిపల్ చైర్మన్ కె. సి నరసింహులు, మున్సిపల్ కమిషనర్ డి.ప్రదీపకుమార్ , మార్కెటింగ్ అధికారులు, ప్రజాప్రతినిధిలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post