MBNR – లక్నో లో నిర్వహించిన ప్రదర్శన లో వీరన్న పేట డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నమూనాకు ప్రసంశ

లక్నో లో నిర్వహించిన ప్రదర్శన లో వీరన్న పేట డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నమూనాకు ప్రసంశ
పట్టణ ప్రాంతాలలో పీఎం ఏ వై ఇళ్ల నిర్మాణం పై లక్నో లో ఏర్పాటు చేసిన నమూనా ప్రదర్శనను భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన లో తెలంగాణ నుండి మహబూబ్ నగర్ వీరన్న పెట్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నమూనా మాత్రమే ఎంపికై ప్రదర్శనకు పంపటం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని వీరన్నపేట లో నిర్మించిన 660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల నమూనా బాగున్నట్లు ప్రదర్శన ఇంచార్జి, పీఎంఏవై పథకానికి సంబంధించిన రిజినల్ కో ఆర్డినేటర్ , సెంట్రల్ టీం ఇన్చార్జి రవి అభినందించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో అర్బన్ పథకం కింద పి ఎం ఏ వై టై ఆప్ తో చేపట్టిన 2 బి హెచ్ కె ఇళ్ల నిర్మాణం పురోగతి బాగుందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో పి ఎం ఏ వై టై ఆప్ తో 4340 ఇళ్లను చేపట్టగా 3000 గృహాలు పూర్తికాగా, 1340 పురోగతిలో ఉన్నాయి. అంతేకాక ఈ పథకానికి సంబంధించి పట్టణ ప్రాంతంలో వ్యక్తిగత గృహాలు మరియు జి ప్లస్ 2 ఇంటి మాడల్ కూడా లక్నోలోని ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన నమూనా పట్ల రవితో పాటు పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక పీఎంఏవై టై ఆప్ తో తీసుకు వచ్చిన నూతన షేర్ వాల్ టెక్నాలజీ బాగుండటం పట్ల పలువురు ప్రశంసించారు.
మహబూబ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మాడల్ జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా కృషిచేసిన రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ,జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు, అదేవిధంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ స్టేట్ ఫైనాన్స్ జి ఎం,రిటైర్డ్ ఎస్ ఈ వెంకటేశ్వర్రెడ్డి, జనరల్ మేనేజర్ చైతన్య ,జిల్లా గృహ నిర్మాణ శాఖ జిల్లా ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్ ఇందుకు సహకరించిన మెప్మా డి ఈ మల్లారెడ్డి మూడురోజులపాటు లక్నో ప్రదర్శనలో పాల్గొన్న ఏ ఈ కుమార్ ,విజయ్ తదితరులు, అందుకు కృషి చేసిన సిబ్బంది అభినందనీయులు .

Share This Post